ఎన్సీపీ కీలక నిర్ణయం..అజిత్ పవార్‌పై వేటు..

-

మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై మీడియాతో మాట్లాడడానికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఎంపీ సుప్రియా సూలె, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే, ఎమ్మెల్యే ఆదిత్య థాకరేతో పాటు పలువురు కాంగ్రెస్ కీలక నేతలు ముంబయిలోని వైబీ చవాన్ సెంటర్ కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో శరద్ పవార్ కు మద్దతుగా కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు.

ఎన్సీపీ శాసనసభా పక్ష నేతగా ఉన్న అజిత్ పవార్ ను ఆ హోదా నుంచి తొలగించే యోచనలో శరద్ పవార్ ఉన్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో మీడియాకు ఈ విషయాన్ని ప్రకటించనున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news