చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ లను భోగి మంటల్లో తగలబెట్టాలి – మంత్రి రోజా

-

Minister Roja : టీడీపీ- జనసేన మేనిఫెస్టోను భోగి మంటల్లో తగలబెట్టాలని..కొంత మంది తగలపెడుతున్నారన్నారు మంత్రి రోజా. తిరుపతిలో భోగి సంబరాల్లో మంత్రి రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ…ఈ సంక్రాంతి అందరికీ జీవితాల్లో వెలుగు నింపాలని కోరారు.

roja participated in bhogi

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలందరూ టిడిపి, జనసేనల చెత్త మ్యానిఫెస్టో ని,చెత్త మాటలను భోగి మంటల్లో వేసి తగలపెడుతున్నారని చురకలు అంటించారు. సంక్రాంతి హైదరాబాదు నుంచి ఊర్లకు వచ్చినట్లు చంద్రబాబు, పవన్ వచ్చారని ఎద్దేవా చేశారు. హైదరాబాదు నుంచి వచ్చి ఇద్దరు నాన్ లోకల్ నేతలు భోగి వేస్తున్నారని ఫైర్ అయ్యారు. భోగి, 2024 ఎన్నికలు అవ్వగానే మళ్ళీ హైదరాబాదు వెళ్ళిపోతారని సెటైర్లు పేల్చారు మంత్రి రోజా. ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ లను తగలబెట్టి, తరిమేయండన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news