సుప్రీంకోర్టులో చంద్రబాబు ఫైబర్ నెట్ కేసు విచారణ వాయిదా..!

-

ఏపీ ఫైబర్ నెట్ కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు రాలేదు. జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ త్రివేదిల దిస్వభ్య ధర్మాసనం చంద్రబాబు బెయిల్ పిటిషన్ ను ఇవాళ విచారించాల్సి ఉండగా.. స్పెషల్ బెంచ్ పిటిషన్ విచారణకు సిట్టింగ్ జడ్జీ కాలేదు.

స్పెషల్ బెంచ్ పిటిషన్ విచారణకు సిట్టింగ్ కాలేదు. స్పెషల్ బెంచ్ లో ఉన్న జస్టిస్ త్రివేది మరో కోర్టులో బిజీగా ఉండటంతో ఇవాళ చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది. చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణకు ఇవాళ తాము కూర్చోవడం లేదని.. మరో తేదీని త్వరలో వెల్లడిస్తామని జస్టిస్ అనిరుధ్ బోస్ తెలిపారు. ఏపీ ఫైబర్ నెట్ వ్యవహారంలో సీఐడీ చంద్రబాబు కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు హై కోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు బాబుకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో బాబు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. సుప్రీకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news