తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు

-

యావత్ భారతావని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య భవ్యరామమందరి ప్రారంభోత్సవానికి ముహూర్తం సమీపిస్తోంది. మరో నాలుగు రోజుల్లో అయోధ్యలో రామ్ లల్లా కొలువుదీరనున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. మరోవైపు రామయ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని చూసేందుకు ఇప్పటికే అయోధ్యకు వెళ్లేందుకు రామభక్తులు రంగం సిద్ధం చేసుకున్నారు.

ఇక రానున్న రోజుల్లో అయోధ్యకు రద్దీ పెరగనున్న నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని సికింద్రాబాద్‌, కాజీపేట రైల్వేస్టేషన్ల నుంచి, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరం, సామర్లకోట స్టేషన్ల నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్ల నడపనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. సికింద్రాబాద్‌ టు అయోధ్య ప్రత్యేక రైళ్లు జనగామ, కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల మీదుగా … విజయవాడ టు అయోధ్య  రైళ్లు.. ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరం, అనపర్తి, సామర్లకోట, అన్నవరం, తుని, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్‌ రైల్వేస్టేషన్ల మీదుగా రాకపోకలు సాగించనున్నాయి.

రైళ్లు సాగే వివరాలు..

సికింద్రాబాద్‌ – అయోధ్య ప్రత్యేక రైళ్లు జనవరి 29, 31 ఫిబ్రవరి 2, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25 తేదీల్లో సాయంత్రం 4.45 గంటలకు బయల్దేరుతాయి.

కాజీపేట నుంచి అయోధ్యకు జనవరి 30, ఫిబ్రవరి 1, 3, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28 తేదీల్లో సాయంత్రం 6.20 గంటలకు బయల్దేరుతాయి.

విజయవాడ నుంచి ఫిబ్రవరి 4న, గుంటూరు నుంచి జనవరి నుంచి 31న, రాజమహేంద్రవరం నుంచి ఫిబ్రవరి 7న సామర్లకోట నుంచి ఫిబ్రవరి 11న ప్రత్యేక రైళ్లు అయోధ్యకు పయనమవుతాయి. అయోధ్య నుంచి తిరిగి ఆయాచోట్లకు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news