‘ఫ్యామిలీ మ్యాన్’ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. సీజన్-3 అప్డేట్ వచ్చేసింది

-

ఓటీటీలో ప్రేక్షకులను విపరీతంగా ఫిదా చేసిన వెబ్ సిరీస్లలో ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ ఒకటి. మొదటి రెండు సీజన్లతో అలరించిన ఈ సిరీస్ ఇప్పుడు మూడో సీజన్ కోసం రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో సీజన్-3కి సంబంధించి ఈ సిరీస్లో శ్రీకాంత్ తివారీ పాత్రలో మెప్పించిన మనోజ్ బాజ్పాయ్ ఓ కీలక అప్డేట్ ఇచ్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన సీజన్-3 గత రెండు సీజన్లకు మించి థ్రిల్ పంచుతుందని తెలిపారు.

అంతే కాకుండా ఫిబ్రవరి ఆఖరి వారంలో ఈ సీజన్ షూటింగ్ షురూ అవుతుందని చెప్పారు. సీజన్-2 ఎక్కడ ఎండ్ అయిందో అక్కడి నుంచి పార్ట్-3 మొదలవుతుందని తెలిపారు. అయితే సీజన్-3లో శ్రీకాంత్ తివారీ పిల్లలు పెద్దవాళ్లవుతారని, వయసు పెరిగినా తివారీని వృత్తిపరంగా సవాళ్లు వెంటాడుతూనే ఉంటాయని సిరీస్పై ఇంకా అంచనాలు పెంచేశారు. సీజన్-3 2025లో.. ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ అయ్యే అవకాశాలున్నాయి. ఈ సిరీస్‌కు రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news