చంద్రబాబు సభకు 5 వేలకు మించి వస్తే.. గుడివాడ వదిలిపోతా – కొడాలి నాని

-

చంద్రబాబు సభకు 5 వేలకు మించి వచ్చినా… 5 వేలకు మించి కుర్చీలేస్తే గుడివాడ వదిలిపోతానని కొడాలి నాని సవాల్‌ చేశారు. మార్పులు చేర్పులు అధినేత సీఎం జగన్ ఇష్టమని… టీడీపీలో మాత్రం ఎంత మందిని మార్చలేదు..? అంటూ నిప్పులు చెరిగారు. చంద్రగిరి నుంచి కుప్పానికి చంద్రబాబు వెళ్లలేదా..? అని ప్రశ్నించారు. మంగళగిరిలో చిన్నప్పటి నుంచి లోకేష్ ఏమైనా గోళీలు ఆడాడా..? గుడివాడలో నా మీద ఇప్పటి వరకు నలుగురు మారారు.. దీనికేం సమాధానం చెబుతారు..? అని నిలదీశారు.

గుడివాడలో చంద్రబాబును చూసేవాళ్లు ఎవరున్నారు..? చంద్రబాబు సభకు లక్ష మంది ఎక్కడ నుంచి వస్తారు..? అంటూ నిలదీశారు. 20 ఎకరాల స్థలంలో పార్కింగుకు పోనూ మిగిలిన స్థలమెంత..? అంటూ ప్రశ్నించారు కొడాలి నాని. చంద్రబాబు సభ కోసం 5 వేలకు మించి కుర్చీలేస్తే గుడివాడ వదిలిపోతానని శపథం చేశారు. పనికి రాని వాళ్లనే సీఎం జగన్ పక్కన పెట్టాడు….జగన్ ఎవరినైతే పక్కన పెట్టారో.. వాళ్లే టీడీపీకి వెళ్తున్నారని తెలిపారు. ప్రతిసారీ అదే నేతలకు టిక్కెట్లివ్వాలా..?
పార్దసారధిని జగన్ పక్కన పెట్టారు.. మేమేళ్లి పార్టీలో ఉండమని కోరామన్నారు. ఇన్నాళ్లూ కలిసి పని చేశాం.. ఇప్పుడెందుకు పార్టీని వీడడమని పార్దసారధిని అడిగామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news