జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దేవర సినిమా రాబోతోంది ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని సముద్ర వీరుడు గా కొట్టాల శివ చూపిస్తూ దేవర సినిమాకి తీసుకువస్తున్నారు. ఆచార్యతో డిజాస్టర్ ని అందుకున్న కొరటాల శివ దేవర తో హిట్ కొట్టాలని కసి మీద పనిచేస్తున్నారు రీసెంట్గా రిలీజ్ అయిన దేవర గ్లిమ్ప్స్ చూస్తే కొరటాల శివ ఎంత కష్టపడుతున్నారనేది మనకి అర్థమవుతుంది. ఇదే స్పీడ్ లో షూటింగ్ కూడా పూర్తి చేస్తున్నారు. అనుకున్న టైంకి కనుక సినిమా షూటింగ్ అయితే ఏప్రిల్ 5న దేవర పార్ట్ వన్ రిలీజ్ అవుతుంది.
ఇప్పటికే దేవరా సినిమా షూటింగ్ 80% పూర్తయిపోయింది లేటెస్ట్గా హైదరాబాదులో అల్యూమినియం ఫ్యాక్టరీలో లాంగ్ షెడ్యూల్ ని కూడా మొదలు పెట్టేసారు భారీ సెట్ ని కూడా వేశారు మరో రెండు వారాలు పాటు షూటింగ్ జరగబోతోంది మరి ఇక దీంతో దేవర షూటింగ్ పూర్తి అయిపోతుందా లేదంటే ఇంకో షెడ్యూల్ ఉందా అనేది తెలియాలి. కేవలం ఇంకా 20% ఉంది కాబట్టి త్వరగానే పూర్తి చేసుకుంటారు అని అర్థమవుతుంది.