జగిత్యాల కళాకారుడు ప్రతిభ అదిరింది. బియ్యపు గింజలతో అయోధ్య రామ మందిరం నిర్మాణాన్ని తయారుచేసి శ్రీరాముడు మీద ఉన్న అమితమైన భక్తిని చాటుకున్నాడు ఈ కళాకారుడు. జగిత్యాల కి చెందిన ప్రముఖ మైక్రో ఆర్టిస్ట్ డాక్టర్ గ్రహీత గుర్రం దయాకర్ తన అద్భుతమైన ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నారు. ఈనెల 22 అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా తన కళాఖండం తయారీకి తను సంకల్పించినట్లు ఆయన చెప్పారు. 16 వేలకి పైగా బియ్యం గింజలతో రామమందిర నిర్మాణాన్ని తయారు చేశానని, 60 గంటలకి పైగా శ్రమించానని చెప్పారు.
త్వరలోనే ఈ మందిరాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి అందిస్తానని దయాకర్ చెప్పారు. ఇప్పటిదాకా ఎవరూ కూడా బియ్యం గింజలతో ఇలాంటి నిర్మాణాన్ని చేయలేదని దయాకర్ చెప్పారు. బియ్యపు గింజలతో అద్భుతమైన కళాఖండానికి తయారుచేసిన దయాకర్ ని అందరూ అభినందిస్తున్నారు దయాకర్ గతంలో కూడా అనేక సూక్ష్మ రూప కళాఖండాలని తయారు చేసి పలు అవార్డులను కూడా అందుకున్నారు.