వైసీపీలో చోటు చేసుకుంటున్న మార్పులు, చేర్పుల నేపథ్యంలో పెనుమలూరు ఇన్ చార్జీగా మంత్రి జోగి రమేష్ ని నియమించింది వైసీపీ అధిష్టానం. దీంతో పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తున్న తనను పక్కకు పెట్టి మంత్రి జోగి రమేష్ కి వైసీపీ అధిష్టానం టికెట్ ఇవ్వడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మాజీ మంత్రి, వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీ గూటికి చేరారు. త్వరలోనే సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలోనే వస్తున్న వార్తలు వాస్తవమే అన్నట్టు ఎమ్మెల్యే పార్థసారథి వైసీపీ పై విమర్శలు చేశారు.
మంత్రులను బూతులు తిట్టడానికి సమీక్షలు నిర్వహించే వైసీపీ.. రైతుల సమస్యలు పరిష్కారం కోసం కూడా సమీక్షలు నిర్వహిస్తే బాగుంటుందన్నారు. అధికార ప్రభుత్వం అనాలోచిత చర్యల వల్లనే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్బీకే నుంచి మిల్లర్లకు తరలించిన ధాన్యాన్ని రోజుల తరబడి దిగుమతి చేసుకోకపోవమే కాకుండా.. తేమ శాతం పేరు చెప్పి బస్తాపై 300 నుంచి 400 వరకు తగ్గించి ఇస్తున్నారని మండిపడ్డారు.