BREAKING :తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ప్రభుత్వ సలహాదారులను నియమించింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వ సలహాదారులుగా వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ ఆలీ, హరకర వేణుగోపాల్ నియామకం అయ్యారు.

ముగ్గురు ప్రభుత్వ సలహాదారులను నియమించిన ప్రభుత్వం.. ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవి నియామకం చేసింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే.. సీఎం రేవంత్ రెడ్డి సలహా దారులుగా వేం నరేందర్ రెడ్డి నియామకం అయ్యారు.
- వెం నరేందర్ రెడ్డి – ప్రభుత్వ సలహా దారు
- షబ్బీర్ అలీ – sc,st..మైనార్టీ వెల్ఫేర్
- మల్లు రవి – ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి
- హరకర వేణుగోపాల్ – ప్రభుత్వ సలహాదారు, ప్రోటోకాల్, పబ్లిక్ రిలేషన్