ఆంధ్ర ప్రదేశ్ లోనూ ‘ఓట్ ఫ్రమ్ హోం’ కార్యక్రమం జరుగనుంది. ఏపీలో ఎన్నిక నిర్వాహనకు ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, 40% పైగా వైకల్యం ఉన్నవారు ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునేలా అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం ముందే 12D వారం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
వాటిని అధికారులు పరిశీలించి ఓట్ ఫ్రమ్ హోం అవకాశం కల్పిస్తారు. ఇప్పటికే పలు రాష్ట్రాల ఎన్నికల్లో ఈ విధానాన్ని ఈసీ విజయవంతంగా అమలు చేసింది. కాగా, ఫిబ్రవరి 2న సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని మాజీ మంత్రి టీడీపీ సత్తెనపల్లి ఇన్చార్జ్ కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. టీడీపీ శ్రేణులంతా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. సత్తెనపల్లిలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీనే అధికారంలోకి వస్తుందని తెలిపారు. అమరావతి నిర్మాణం, రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని స్పష్టం చేశారు. వైసీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారని విమర్శించారు.