అంతరిక్షం నుంచి అయోధ్యను చూశారా?.. ఫొటోలు విడుదల చేసిన ఇస్రో

-

యావత్‌ భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అపురూప ఘట్టం మరి కొద్ది క్షణాల్లో ఆవిష్కృతం కానుంది. ఈ వేడుకను కళ్లారా వీక్షించేందుకు ఇప్పటికే దేశ నలుమూలల నుంచి అతిరథ మహారథులు, శ్రీరాముడి భక్తులు అయోధ్య నగరాన్ని చేరుకున్నారు. బాల రాముడి ప్రాణపత్రిష్ఠాపన మహోత్సవానికి అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ నేపథ్యంలో అంతరిక్షం నుంచి అయోధ్య నగరం ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారా

మీకోసమే అంతరిక్ష రంగంలో తనదైన ముద్రవేసుకున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ మహత్తర వేడుకలో భాగమైంది. అంతరిక్షం నుంచి అయోధ్య నగరం, రామమందిరం ఎలా కనిపిస్తున్నాయో ఫొటోలు తీయగా.. వాటిని ఇస్రోకు చెందిన నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్ (NRSC) విడుదల చేసింది. డిసెంబర్‌ 16వ తేదీన తీసిన ఈ చిత్రాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. కేవలం అయోధ్య రామ మందిరమే కాకుండా దశరథ్‌ మహల్‌, సరయు నదిని కూడా ఇందులో చూడొచ్చు. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఆ బాలరాముడి కోవెలను ఓసారి నింగి నుంచి చూస్తే ఎలా కనిపిస్తుందో చూసేయండి.

Read more RELATED
Recommended to you

Latest news