అయోధ్య లో పండగ వాతావరణం ఎప్పుడో మొదలైపోయింది ఈరోజు అయోధ్యలో బాల రాముడు ప్రాణ ప్రతిష్ట చేయబోతున్నారు దీనికోసం అందంగా ముస్తాబు చేసారు. మధ్యాహ్నం 12:29 నుండి 12:30 వరకు ప్రాణ ప్రతిష్ట ముహూర్తంగా నిర్ణయించారు మధ్యాహ్నం ఒకటి నుండి రెండు గంటల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ మోహన్ యోగి ఉపన్యాసాలు ఇవ్వబోతున్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు వివిధ రాష్ట్రాల నుండి అయోధ్యకి వెళ్లారు.
ఇక ఇది ఇలా ఉంటే సామాన్య భక్తులకి రేపటి నుండి దర్శనం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు సామాన్య భక్తులు రేపటినుండి దర్శనానికి వెళ్లొచ్చు బాలరాముడు దర్శనానికి రెండు స్లాట్స్ కలరు చూశారు. ఉదయం ఏడు గంటల నుండి 11 గంటల వరకు దర్శనం ఉంటుంది. అలానే మధ్యాహ్నం రెండు నుండి రాత్రి 7 వరకు మరొక స్లాట్ లో దర్శనం చేసుకోవచ్చు. స్వర్ణాభరణాలతో బాలరాముడు కనబడుతున్నారు ఎడమ చేతిలో విల్లు, కుడి చేతిలో బాణంతో బాల రాముడు కనపడుతున్నారు.