బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నల్గొండ లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో మాట్లాడారు. పార్టీకి ప్రభుత్వానికి సమన్వయం లేకపోవడం వలన ఈ పరిస్థితి ఎదురైందని కార్యకర్తలు అంటున్నారు బీఆర్ఎస్ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయని అన్నారు. ఫిబ్రవరి మొదటి వారం నుండి అసెంబ్లీ నియోజక వర్గాల సమీక్షలు మొదలవుతాయి. ఇంకా మాట్లాడటం మొదలుపెట్టనేలేదు కాంగ్రెస్ వాళ్లు ఉలికి పడుతున్నారు అని అన్నారు.
కెసిఆర్ అసెంబ్లీకి వస్తే ఇంకా ఎలా ఉంటుందో ఊహించుకోండి అని అన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, గత నవంబర్లో కరెంట్ బిల్లులు కట్టొద్దు అని అన్నారు నల్గొండ ప్రజలు బిల్లులు కట్టకుండా కోమటిరెడ్డి కి పంపండి అని కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి భుజం మీద తుపాకీ పెట్టి ప్రధాని మోడీ BRS ని కాలుస్తారట అని అన్నారు మైనారిటీ సోదరులకు కాంగ్రెస్ బిజెపి అక్రమ సంబంధం గురించి చెప్పాలని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.