వైయస్ షర్మిల కాంగ్రెస్ గూటికి చేరిన సంగతి మనకి తెలుసు. గత రెండు రోజుల క్రితం ఆమె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్నారు. అయితే షర్మిల అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ ని తరపు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఆమె ఈ రోజునుండి మొత్తం తొమ్మిది రోజుల దాకా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించబోతున్నారు ఈరోజు ఇచ్చాపురంలో పర్యటిస్తున్నారు షర్మిల.
ఈ నేపథ్యంలో ప్రసంగించిన వైఎస్ షర్మిల ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే దేశానికి మంచిదని చెప్పారు. రాహుల్ గాంధీ కనుక ప్రధాని అయ్యారంటే మతపరమైన హింసలు తగ్గుతాయని దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి మనస్పూర్తిగా నమ్మి రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని అనుకున్నట్లు ఆమె చెప్పారు తాను కూడా రాజశేఖర్ రెడ్డి బాటలో నడుస్తూ రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి కాంగ్రెస్లో చేరానని అన్నారు.