అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ట సందర్భంగా రాష్ట్రపతిని ఎందుకు పిలవలేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ నిలదీశారు. ఆమె ముత్తైదువు కాదని పిలవ లేదా..? అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక మతానికి చెందిన కార్యక్రమాన్ని ప్రభుత్వం చేయడం రాజ్యాంగ ఉల్లంఘనే అన్నారు. మతం రాజకీయం ఒక్కటి చేశారన్నారు.
రామాలయం నిర్మాణాన్ని తాము వ్యతిరేకం కాదని.. ప్రధాని మోడీ, సీఎం యోగిలు ఒక ఈవెంట్ మేనేజర్ ల వేడుకను నిర్వహించారని.. అధికారం కోసం దేశ ప్రయోజనాలను దెబ్బ తీస్తున్నారని మండి పడ్డా సీపీఐ నారాయణ. రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి అద్వానిని కావాలనే కట్ చేశారన్నారు. బాబ్రీ మసీదును కూల్చివేతను దేశమంతా చూశారని.. రామ మందిర నిర్మాణానికి అనుకూలంగా తీర్పు ఇచ్చిన జడ్జీలలో ఒకరికీ రాజ్యసభ, మరొకరికీ గవర్నర్ గిరి వంటి పదవులు కట్టబెట్టారని ఆరోపించారు. ఇండియా కూటమి బలోపేతం కోసం కాంగ్రెస్ వ్యవహరించాలన్నారు. మోడీ బ్లాక్ మెయిల్ కి భయపడి కొందరూ ఇండియా కూటమికి దూరంగా ఉంటున్నారని వెల్లడించారు.