కర్తవ్య పథ్‌లో ఆకట్టుకున్న వివిధ రాష్ట్రాల శకటాలు

-

75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు దిల్లీ కర్తవ్యపథ్లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన పరేడ్ అందరినీ ఆకర్షించింది. ఈ పరేడ్‌లో ప్రదర్శించిన శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దేశ ఆయుధ శక్తిని చాటేలా ఈ శకటాలను ప్రదర్శించగా.. ఆత్మనిర్భరత, నారీశక్తి థీమ్‌తో నౌకాదళ శకటం ఆకట్టుకుంది. ఐఎన్ఎస్ విక్రాంత్‌తో పాటు, శివాళిక్‌, కలవరి క్లాస్‌ సబ్‌మెరైన్లను ప్రదర్శించారు.

దేశీయంగా తయారుచేసిన ఆయుధాలతో పాటు క్షిపణులు, డ్రోన్‌ జామర్లు, నిఘా వ్యవస్థలు, వాహనాలపై అమర్చే మోటార్లు, బీఎంపీ-2 సాయుధ శకటాలు ప్రదర్శించారు. లెఫ్టినెంట్ ఆఫీసర్‌ అనన్య శర్మ, ఫ్లయింగ్ ఆఫీసర్ అస్మా షేక్ వైమానిక దళ శకటానికి నేతృత్వం వహించారు. మహిళా శక్తి, ఆత్మనిర్భర్త ధీమ్‌లతో భారత వైమానిక దళం శకటం, డీఆర్డీఓ వెటరన్స్‌ శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

అనంతరం నిర్వహించిన పలు రాష్ట్రాల శకటాలు ఆయా రాష్ట్రాల ప్రగతిని సాంస్కృతి సాంప్రదాయాలను ఆచారాలను చాటాయి. అయోధ్య రామాలయ ప్రత్యేకతను తలపించేలా ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రదర్శించిన శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చంద్రయాన్‌ -3 విజయానికి గుర్తుగా ఇస్రో ప్రదర్శించిన శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలవగా.. ఈ శకటం ప్రదర్శించే సమయంలో కేంద్రమంత్రులు లేచి నిలబడి చప్పట్లు కొట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news