75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వేడుకలను అంగరంగ వైభవంగా జరిపారు. ఈ నేపథ్యంలో రిపబ్లిక్ డేను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా కొంతమంది ఖైదీలను విడదల చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 231 మంది ఖైదీలను ఎంపిక చేసింది. ఇందులో జీవితకాల ఖైదీలు 212, జీవితేతర ఖైదీలు 19 మందిని విడుదల చేయనున్నారు..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016, 2020లో రెండు సందర్భాల్లో ఖైదీలను ముందస్తు విడుదల చేశారు.
సాధారణంగా జనవరి 26న గణతంత్రం దినోత్సవం, 15 ఆగస్టు స్వాతంత్య్ర దినోత్సవం, అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు.. ఈ మూడు సందర్బాల్లో ప్రభుత్వం ఖేదీలను విడుదల చేయడం పరిగణననలోకి తీసుకుంటుంది. ఆర్టికల్ 161 ప్రకారం మంచి ప్రవర్తన కలిగి ఖైదీలను విడదల చేసి అవకాశం ఉంటుంది..ఖైదీల విడుదల చేయాలని కొంతకాలం నుంచి ప్రజా ప్రతినిధులు,స్వచ్ఛంద సంస్థలు, ఖైదీలు వారి కుటుంబ సభ్యులు కోరగాప్రభుత్వం స్పందించి వారిని విడదల చేయాలని నిర్ణయించింది.