IND vs ENG : 420 పరుగులకు ఇంగ్లాండ్‌ ఆలౌట్‌.. టీమిండియా ముందు భారీ టార్గెట్

-

IND VS ENG : ఉప్పల్ టెస్ట్ లో ఇంగ్లాండ్‌ జట్టు పట్టుబిగించింది. నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్‌ జట్టు… సెకండ్ ఇన్నింగ్స్ లో 420 పరుగలకు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ 246 ఆలౌట్ కాగా, భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్ 436 ఆలౌట్ అయింది. లంచ్‌ బ్రేక్‌ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించనుంది భారత్.

India need 230 runs

ఇక భారత్ బౌలింగ్ విషయానికి వస్తే…మొదటి ఇన్నింగ్స్ లో జడేజా 3, అశ్విన్ 3, బూమ్రా 2, అక్షర్ పటేల్ 2 వికెట్లు పడగొట్టారు. రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్లు తీశాడు బూమ్రా అశ్విన్ 3, జడేజా 2, అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌ లో సిరాజ్‌ దారుణంగా విఫలమయ్యాడు. ఇక ఇంగ్లాండ్‌ బ్యాటర్లలో పోప్ డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. 196 పరుగుల వద్ద ఔట్‌ అయ్యాడు పోప్‌. ఇక 230 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందుంచింది ఇంగ్లండ్ జట్టు. రేపటి లోగా ఆ లక్ష్యాన్ని చేధించాల్సి ఉంటుంది టీమిండియా.

Read more RELATED
Recommended to you

Latest news