స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ షాపుపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ షాపుపై పోలీసు కేసును పునఃపరిశీలన చేయాలని డీజీపీకి సీఎం రేవంత్‌రెడ్డి సూచనలు చేశారు. ఫుడ్ స్టాల్ స్థలాన్ని మార్చాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి.
కుమారి పాత స్థలంలోనే వ్యాపారాన్ని కొనసాగించవచ్చు.. త్వరలో కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్‌ను సందర్శిస్తానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. అయితే, సోషల్ మీడియాలో పాపులర్ అయిన కుమారి ఆంటీ హోటల్ మూతపడటంతో వైసీపీ, జేఎస్పీ మధ్య ట్వీట్ల వార్ మొదలైంది. తనకు ఆస్తులు లేవని, కేవలం జగనన్న ఇల్లు ఒకటే ఉందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె అన్నారు.
ఆ వీడియోను వైసీపీ శ్రేణులు ట్రెండ్ చేశాయి. దీంతో కుట్రపూరితంగా రేవంత్ రెడ్డితో చెప్పి టీడీపీ హోటల్ మూసి వేయించిందని వైసీపీ ఆరోపిస్తోంది. దీనికి సమస్యల్లో ఉన్న మహిళను ఆదుకోవడం మాని ఆరోపణలు చేయడానికి సిగ్గులేదా? అని జనసేన ప్రశ్నించింది.