ఏపీ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..!

-

ఏపీ కేబినెట్ ఇవాళ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. సచివాలయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం కొనసాగింది. సమావేశంలో పలు కీలక అంశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

  • మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు గ్రీన్ సిగ్నల్
  • 6,100 పోస్టులతో డీఎస్సీ నిర్వహణకు కేబినెట్ ఆమోదం
  • వైఎస్సార్ చేయూత 4వ విడుత ఆమోదం
  • ఫిబ్రవరిలో వైఎస్సార్ చేయూత నిధులు విడుదల
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మహిళలకు రూ.5వేల కోట్ల నిధుల విడుదలకు ఆమోదం
  • ఎస్ఐపీబీ ఆమోదించిన తీర్మాణాలకు గ్రీన్ సిగ్నల్
  • ఇంధనరంగంలో 22వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం
  • ఎస్ఈఆర్టీలోకి ఐబీ భాగస్వామ్యానికి కేబినెట్ ఆమోదం
  • యూనివర్సీటీలు, ఉన్నత విద్యా సంస్థల్లో పని చేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 కి పెంపు
  • అటవీశాఖలో 689 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం
  • నంద్యాల, కర్నూలు జిల్లాల్లో రెండు విండ్ పవర్ ప్రాజెక్టులకు ఆమోదం
  • శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో 600 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్ట్ ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
  • ఆర్జేయూకేటీకి రిజిస్ట్రార్ సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news