అన్నదాతల కోసం 11.8 కోట్ల ఆర్థిక సాయం – నిర్మలా సీతారామన్‌

-

అన్నదాతల కోసం 11.8 కోట్ల ఆర్థిక సాయం చేశామన్నారు నిర్మలా సీతారామన్‌. వ్యవసాయ రంగానికి మా ప్రభుత్వం కొత్త ఊపిరినిచ్చిందని వివరించారు నిర్మలా సీతారామన్‌. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు 2024-25 ప్రారంభమయ్యాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రసంగిస్తున్నారు. ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోందని ఆమె అన్నారు.

ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం, దేశాల మధ్య ఉద్రిక్తతలు ప్రపంచ వాణిజ్యాన్ని క్లిష్టతరం చేస్తున్నాయని తెలిపారు. అలాగే, ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కీలక ప్రకటన చేశారు. కరెంటు కష్టాలు లేని దేశం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కట్టిబడి ఉందని తెలిపారు. దేశంలో కోటీ ఇండ్లపై రూఫ్ ఆఫ్ సోలార్ సెట్ అప్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ప్రతి ఇంటికి 3 యూనిట్ల సోలార్ విద్యుత్ ఉచితంగా అందిస్తామని బడ్జెట్లో ప్రకటన చేశారు నిర్మల సీతారామన్. దీంతో ప్రతి కుటుంబానికి ఏటా 15 వేల నుంచి 18 వేల రూపాయలు ఆదా అవుతుందని వివరించారు. వినియోగం పొగ మిగిలిన విద్యుత్తును పంపిణీ సంస్థలకు విక్రయించవచ్చని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news