రైలు బోగీలన్నింటినీ వందేభారత్‌ ప్రమాణాలతో మార్పు : నిర్మలమ్మ

-

జైవిజ్ఞాన్‌, జైకిసాన్‌, జైఅనుసంధాన్‌ అన్నది మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. నూతన పరిజ్ఞానం, మార్కెట్‌ వ్యవస్థ అనుసంధానంతో వ్యవసాయరంగాలకు కొత్త ఆదాయ మార్గాలు అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. సమీకృత సాంకేతిక అభివృద్ధి దిశగా రక్షణ రంగానికి ఊతమిచ్చామని వెల్లడించారు. రైలు మార్గాల్లో హైట్రాఫిక్‌, హైడెన్షిటీ కారిడార్లలో నూతన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. రైలు బోగీలను ఇప్పటికే వందేభారత్‌ ప్రమాణాలతో మార్పు చేశామని, భవిష్యత్లో మరికొన్ని చేయనున్నట్లు వివరించారు.

“విమానయాన రంగంలో 2, 3 తరగతి నగరాలకు కొత్త విమాన సర్వీసులు అందుబాటులోకి తెస్తాం. మన విమానయాన సంస్థలు.. వెయ్యి విమానాలకు పైగా ఆర్డర్‌ చేశాయి. ఈ విమానాల ఆర్డర్లే మన విమానయాన అభివృద్ధిని తెలియజేస్తున్నాయి. మరోవైపు వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడింపు, వృథాను అరికట్టి రైతులకు అధిక ఆదాయం సమకూర్చే పథకాలు తీసుకువచ్చాం. వ్యవసాయ ఉత్పత్తుల కోసం గిడ్డంగులు, ప్రాసెసింగ్‌ కోసం ఆర్థిక సాయం అందిస్తున్నాం. నూనె గింజల ఉత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించేందుకు కొత్త పథకం తీసుకొచ్చాం. 83 లక్షల ఎస్‌ఎస్‌జీల ద్వారా 9 కోట్లమంది మహిళలు ఆర్థికంగా ఉన్నతి సాధించారు. కోటిమంది లక్షాధికారులుగా తయారయ్యారు. 2 కోట్ల నుంచి 3 కోట్లమంది మహిళలు లఖ్‌పతిదీదీలు కావాలన్నదే లక్ష్యం.” అని నిర్మలా సీతారామన్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news