రాజ్ భవన్ చేరుకున్న ఝార్ఖండ్ కి కాబోయే సీఎం చంపై సోరెన్

-

ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న జేఎంఎం నేత చంపై సోరెన్ రాజ్ భవన్ చేరుకున్నారు. గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ను ఆయన కలుస్తారు.భూ కుంభకోణం కేసులో ఈడీ అధికారులు జేఎంఎం అధినేత హేమంత్ సొరెన్ ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.సీఎం పదవికి హేమంత్ సోరెన్ రాజీనామా చేయడంతో ఆ పార్టీ శాసనసభపక్ష నేతగా ఉన్న చంపై సోరెన్ ను ఝార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలోనే తదుపరి కార్యచరణ కోసం గవర్నర్ను కలిసేందుకు రాజ్ భవన్ కు ఆయన వచ్చారు.

ఇదిలా ఉంటే…జార్ఖండ్ సంక్షోభం నేపథ్యంలో రేవంత్ రెడ్డికి ఎఐసిసి పెద్దలు పలు సూచనలు చేశారు. ఎఐసిసి ఆదేశాలతో ఎమ్మెల్యేల క్యాంపు కోసం రేవంత్ రెడ్డి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జేఎంఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్ కు తరలిస్తున్నారు.ప్రత్యేక విమానం ద్వారా ఎమ్మెల్యేలు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత గచ్చిబౌలిలో హోటల్ ఎల్లాలో ఝార్ఖండ్ ఎమ్మెల్యేలకు వసతి కల్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news