హైదరాబాద్ చేరుకున్న జార్ఖండ్ ఎమ్మెల్యేలు

-

జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జార్ఖండ్ ముక్తి మోర్చా  నేత చంపాయ్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేసిన కొద్దిసేపటికే కీలక పరిణామం చోటుచేసుకుంది. అధికార జేఎంఎం నేతృత్వంలోని సంకీర్ణ ఎమ్మెల్యేలు ఈరోజు హైదరాబాద్‌కు చేరుకున్నారు. రెండు ప్రత్యేక విమానాల్లో 43 మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కు తరలివచ్చారు. అయితే వీరు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి నేరుగా శామీర్‌పేట్‌లోని ఓ రిసార్ట్స్‌కు తరలించేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ ఏర్పాట్లను చేస్తోంది.

జార్ఖండ్ అసెంబ్లీలో బలపరీక్ష తేదీ ఖరారయ్యే వరకూ వీరంతా హైదరాబాద్‌ క్యాంపులోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్‌ జార్ఖండ్‌ బాధ్యతలను తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జీ దీపా దాస్ మున్షి, మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఏఐసీసీ సెక్రటరీ సంపత్‌ కుమార్‌కు టీపీసీసీ అప్పగించింది.  అయితే తమ ఎమ్మెల్యేలను ప్రతిపక్ష బీజేపీలోకి లాక్కునే అవకాశం ఉన్నందున తాము ఈ సమయంలో ఎటువంటి అవకాశాన్ని తీసుకోలేమని ఈ పార్టీకి చెందిన కీలక నేత చెప్పారు. JMM నేతృత్వంలోని ప్రభుత్వానికి 81 మంది సభ్యుల జార్ఖండ్ అసెంబ్లీలో 43 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news