సర్వైకల్ క్యాన్సర్ తో బాలీవుడ్ నటి పూనం పాండే చనిపోయిందన్న వార్త దేశ వ్యాప్తంగా కూడా స్ప్రెడ్ అయింది గర్భాశయం ముఖద్వారా క్యాన్సర్ గురించి నేషనల్ వైడ్ గా విస్తృతంగా చర్చ కొనసాగుతుంది. అయితే ఆమె చనిపోలేదని తాజాగా వీడియో చేసింది. ఈ అంశంపై ట్విట్టర్ వేదికగా వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ స్పందించారు.
హే పూనమ్ పాండే ఈ సమస్యపై అందరూ దృష్టిని మరల్చడానికి మీరు ఎంచుకున్న ఈ విపరీతమైన పద్ధతి విమర్శకి దారి తీయొచ్చు. కానీ మీ ఉద్దేశాన్ని ఎవరు ప్రశ్నించలేరు ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ మీద చర్చ ట్రెండింగ్ లో ఉంది. మీ ఆత్మ చాలా అందంగా ఉంది మీరు సంతోషకరమైన సుదీర్ఘమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను అని రామ్ గోపాల్ వర్మ పూనమ్ పాండే పై ట్వీట్ చేశారు.