బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ తొలి డిప్యూటీ సీఎం స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే రాజీనామా చేశారు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య రాజీనామా లేఖని శనివారం BRS అధినేత కేసిఆర్ కి పంపించారు. BRS లో తనకి గౌరవం లేదని ఈ ఉదయం ఆవేదనని వ్యక్తపరిచారు గత ఆరు నెలలుగా తాను మానసిక క్షోభ ని అనుభవిస్తున్నానని చెప్పారు. టికెట్ దక్కకుండా పార్టీకి వీర విధేయుడుగా ఉన్నానని అన్నారు అయినా కూడా అధిష్టానం నుండి మాత్రం స్పందన రాలేదని అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కకపోయినా పార్టీలో కొనసాగిన రాజయ్య పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నారు ఈ విషయంపై సంకేతాలని అధిష్టానానికి పంపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆయనకి టికెట్ కేటాయించేందుకు అధిష్టానం సుముఖంగా లేకపోవడంతో గుడ్ బాయ్ చెప్పడమే మంచిది అని భావించారు అందుకనే కార్యకర్తలతో మాట్లాడి తాజాగా రాజీనామా చేశారు ఈనెల 10వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు.