కులగణనకు క్యాబినెట్ ఆమోదం తెలపటం సంతోషంగా ఉంది – పొన్నం ప్రభాకర్

-

సచివాలయంలో రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.బీసీల జీవితకాల వాంఛ అయిన కులగణనకు తెలంగాణ క్యాబినెట్ ఆమోదం తెలపడం సంతోషంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మేమెంతో మాకంత అనే నినాదాన్ని నిజం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గొప్పదని అన్నారు. అణగారిన వర్గాల ఆకాంక్షలు నెరవేరాలంటే జనాభా లెక్కలు తేలాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బీసీలు అంటే వెనుకబడిన కులాలు కాదని దేశానికి రాష్ట్రానికి వెన్నుముక వర్గాలని కొనియాడారు.

ఈ సమావేశానికి మంత్రి శ్రీధర్ బాబు తో పాటు మంత్రులు శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీ జీవన్ రెడ్డి, శ్రీ దామోదర రాజనర్సింహ,ఎమ్మెల్యేలు శ్రీ సుదర్శన్ రెడ్డి, శ్రీ రోహిత్ రావు, శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే శ్రీ ఏ. చంద్రశేఖర్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈనెల 8 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news