‘ఇది ఆరంభం మాత్రమే’.. పశ్చిమాసియాలోని మిలిటెంట్లకు అమెరికా వార్నింగ్

-

ఇరాక్‌, సిరియాలో తాము ఇటీవల జరిపిన ప్రతీకార దాడులు కేవలం ఆరంభం మాత్రమేనని అంతం కాదని అమెరికా హెచ్చరించింది. ఇరాన్‌కు తగిన బుద్ధి చెప్పేందుకు మరిన్ని చర్యలు ఉంటాయని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. శుక్రవారం నాటి దాడులతో ఆ ప్రాంతంలోని మిలిటెంట్‌ గ్రూప్‌ల సామర్థ్యం తీవ్రంగా దెబ్బతిందని అమెరికా జాతీయ భద్రతా సలహాదారుడు జేక్‌ సలీవన్‌ అన్నారు. పశ్చిమాసియాలో ఘర్షణను కోరుకోవడం లేదని స్పష్టం చేశారు.

అయితే, అమెరికన్ల జోలికి వస్తే సహించేది లేదని, మరిన్ని భీకర దాడులు ఉంటాయని సలీవన్ హెచ్చరించారు. శుక్రవారం నాటి దాడుల తర్వాత సిరియాలోని అమెరికా స్థావరంపై మరో దాడి జరిగిందని  ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని తెలిపారు. ఇరాన్‌ మద్దతుతో సిరియా, ఇరాక్‌లో ఉన్న మిలిటెంట్లు, హూతీల నుంచి భవిష్యత్తులో తమపై మరిన్ని దాడులు ఉండవని కచ్చితంగా చెప్పలేమని అన్నారు. అందుకే ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తమ సైన్యాన్ని ఆదేశించారని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news