తెలంగాణలో EAPCET (ఎంసెట్) షెడ్యూల్ విడుదల

-

తెలంగాణలో EAPCET-2024 నోటిఫికేషన్ ను ఫిబ్రవరి 21న విడుదల చేయనున్నట్టు తెలంగాణ ఉన్నత విద్యామండలి తాజాగా వెల్లడించింది. ఇదివరకు నిర్వహించిన ఎంసెట్ పరీక్షకు ఈ ఏడాది నుంచి EAPCET అని నామకరణం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఫిబ్రవరి 26 నుంచి ఏప్రిల్ 06 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఆ దరఖాస్తులను కూడా ఆన్ లైన్ లోనే సమర్పించాలని స్పష్టం చేశారు. మే 09 నుంచి 12 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

గతంలో ఇంజినీరింగ్, మెడికల్ లో ప్రవేశాలకు ఎంసెట్ లో సాధించిన ర్యాంకుల ఆధారంగా సీట్లు భర్తీ చేసే వారు. కానీ ప్రస్తుతం మెడిసిన్, డెంటల్, యునానీ, ఆయుర్వేద, హోమియో కోర్సుల్లో ప్రవేశాలకు నీట్ నిర్వహిస్తున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జాతీయ స్థాయిలో ఈ పరీక్ష నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో మెడిసిన్ అనే పదాన్ని ఎంసెట్ నుంచి తొలగించింది. దీంతో ఎంసెట్ కి బదులు ఎప్ సెట్ గా మారనుంది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీలో ప్రవేశాలకు మాత్రమే నిర్వహించే పరీక్ష కావడంతో ఎప్ సెట్ గా పేరును ఖరారు చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news