కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రెండు నెలల్లోనే వసూళ్లకు తెరలేపిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులను ఢిల్లీ పెద్దల పేరు చెప్పి బెదిరిస్తున్నారని, డబ్బులు వసూళ్లు చేస్తున్నారని విమర్శించారు.
బుధవారం కిషన్ రెడ్డి ఢిల్లీలో మాట్లాడుతూ.. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల కోసం బీజేపీ కేంద్ర నాయకత్వంతో చర్చలు జరిపినట్లు తెలిపారు. రేపు ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశం జరుగుతుందన్నారు. పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై చర్చ ఉంటుందని తెలిపారు.ఇందులో నుంచి ఒక్కో లోక్ సభ నియోజకవర్గానికి 3 నుంచి 5 మంది అభ్యర్థులను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. త్వరలో తుది జాబితా విడుదల చేస్తామన్నారు. రాష్ట్రంలో వాతావరణం బీజేపీకి చాలా అనుకూలంగా ఉందని ఆయన అన్నారు.వచ్చే లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి వెల్లడించారు. మెజారిటీ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అన్ని వర్గాల నుంచి బీజేపీలో చేరేందుకు ఉత్సాహంగా వస్తున్నారని, ఎవరొచ్చినా చేర్చుకుంటామని అన్నారు.