పీవీ నరసింహారావు గ్రామంలో సంబరాలు నిర్వహించండని పిలుపునిచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారికి భారత రత్న రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. తమ హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పివి నరసింహ రావు గారికి భారత రత్న ప్రకటించడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్.
ఈ సందర్భంగా పీవీ నరసింహారావు గారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న మంత్రి పొన్నం….వంగర గ్రామంలో సంబరాలు చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అటు తెలంగాణ బిడ్డ, భారత మాజీ ప్రధాని పివి నరసింహారావుకు దేశ అత్యన్నత పురస్కారం భారత రత్న దక్కడం పట్ల బిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ పురస్కారం తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవంగా కేసీఆర్ పేర్కొన్నారు. పీవీ కి భారత రత్న ప్రకటించాలని బిఆర్ఎస్ పార్టీ చేసిన డిమాండ్ ను గౌరవించి పీవీ నరసింహారావు కు భారత రత్న ఇవ్వడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.