ఎన్నికల్లో పడిపోయే తొలి వికెట్ రోజానే – పృథ్వీరాజ్

-

ఎన్నికల్లో పడిపోయే తొలి వికెట్ రోజానే అంటూ వైసీపీ పార్టీపై జనసేన నేత, సినీ నటుడు పృథ్వీరాజ్ సంచలన కామెంట్స్ చేశారు. ఏపీలోని శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు ఎన్నికల సర్వే చేశానని..అందులో వైసీపీ పార్టీ ఓడిపోతుందని తేలిందన్నారు. టీడీపీ – జనసేన కూటమికి 136 అసెంబ్లీ , 21 ఎంపీ స్థానాలు రావడం ఖాయం అని చెప్పారు జనసేన నేత, సినీ నటుడు పృథ్వీరాజ్. సీఎం జగన్ పిసినారి… జేబులో నుంచి పైసా తియ్యడంటూ చురకలు అంటించారు.

Movie actor Prithviraj sensational comments on roja

ఎన్నికల్లో పడిపోయే తొలి వికెట్ రోజానేనంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు జనసేన నేత, సినీ నటుడు పృథ్వీరాజ్. జనసేన – టీడీపీ ప్రభుత్వం వచ్చాక రోజా అక్రమాలపై విచారణ ఉంటుందని తెలిపారు. పవన్ కళ్యాణ్‌ మూడు పెళ్లిళ్లు చేసుకోవడం , రెండు చోట్ల ఓడిపోవడం వలన పోలవరం నిర్మాణానికి ఏమైనా నష్టం జరిగిందా…అంటూ నిలదీశారు జనసేన నేత, సినీ నటుడు పృథ్వీరాజ్. నా దగ్గర బ్రౌన్ కలర్ లో డైరీ ఉంది ఎమ్మెల్యేలు ఎంత డబ్బు సంపాదించారో నోట్ చేశానని హెచ్చరించారు. జనసేన వెంటనే మెగా ఫాన్స్ ఉంటారని తెలిపారు జనసేన నేత, సినీ నటుడు పృథ్వీరాజ్.

Read more RELATED
Recommended to you

Latest news