కేసీఆర్‌ను ఆహ్వానించాలని సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు ఎమ్మెల్యేలను తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి కేసీఆర్ ను ప్రత్యేకంగా ఆహ్వానించాలని ఆయన డిసైడ్ అయ్యారు.
ఈ బాధ్యతను మంత్రి ఉత్తమ్ కు సీఎం అప్పగించారు. 13న ఎమ్మెల్యేల కాలేశ్వరం పర్యటన నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను 12వ తేదీనే ముగించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అటు 13వ తేదీన నల్గొండలో బీఆర్ఎస్ సభ ఉండటంతో కేసీఆర్ రాకపై ఉత్కంఠ నెలకొంది.
ఇక అటు బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ నేడు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారు. రెండు రోజుల కిందట సమావేశాలు ప్రారంభం అవ్వగా ఆయన శాసనసభకు హాజరుకాలేదు. కాగా, ఇవాళ 2024-25 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో ఆయన సభకు రానున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ తొలిసారిగా సమావేశాలకు హాజరవుతుండటంపై ఆసక్తి నెలకొంది.