చంద్రబాబు లక్కీ నంబర్ 23: రామ్ గోపాల్ వర్మ

-

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఆర్జీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ మధ్య సినిమాలను పక్కన పెట్టి.. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ లో వివాదాస్పద ట్వీట్స్ చేస్తూ కాలం గడిపేస్తున్నాడు. అయితే ఆర్జీవి తాజాగా చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.టీడీపీ అధినేత చంద్రబాబు లక్కీ నంబర్ 23 అని డైరెక్టర్ ఆర్జీవీ ట్వీట్ చేశారు. ‘వైసీపీ నుంచి ఆయన లాక్కున్న MLAల సంఖ్య 23.2019లో బాబు గెల్చుకున్న స్థానాలు 23. ఆయన అరెస్టయిన తేదీ 9-9-23 కూడితే 23. ఆయన ఖైదీ నంబర్ 7691.. కూడితే 23. NTR నుంచి లాక్కున్న పార్టీకి వారసుడిగా చేద్దామనుకుంటోన్న లోకేశ్ పుట్టిన తేదీ 23.

ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వ్యూహం’ సినిమా రిలీజ్ 23న’ అని రాసుకొచ్చారు.రామదూత క్రియేషన్స్ బ్యానర్ లో దాసరి కిరణ్ కుమార్ ఈ సినిమాని రూపొందిస్తున్నాడు. ఈ సినిమాల్లో వైయస్ జగన్ పాత్రలో తమిళ నటుడు అజ్మల్ నటిస్తుండగా, తన భార్య వైఎస్ భారతి పాత్రలో మానస నటిస్తుంది.సినిమాలో వైఎస్సార్ మరణం ఆ తర్వాత జరిగే ఓదార్పు యాత్ర.. జగన్ జైలు ప్రయాణం.. బెయిల్ పై వచ్చి పాదయాత్ర మొదలుపెట్టడం.. మొదలగు అంశాలపై ఈ సినిమా రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news