టాలీవుడ్ యంగ్ టాలెంట్ తేజ సజ్జా ప్రధాన పాత్రలో ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘హనుమాన్’. విడుదలకు ముందు నుంచే సూపర్ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా రిలీజ్ తర్వాత సూపర్ హిట్ టాక్‌ను సంపాదించుకుంది. అంతే కాకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే పలు రికార్డులు క్రియేట్ చేసిన హనుమాన్ తాజాగా మరో సరికొత్త మైలురాయిని చేరుకుంది.
విడుదలైన 25 రోజుల్లో రూ.300కోట్లు వసూళ్లు చేసి మరో సెన్సేషనల్ రికార్డు క్రియేట్ చేసింది హనుమాన్. ఈ ఏడాదిలో రూ.300 కోట్లు సాధించిన మొదటి సినిమాగా రికార్డును నెలకొల్పింది. దీనిపై దర్శకుడు ప్రశాంత్ వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. కాగా ‘హనుమాన్’ బంపర్ విజయాన్ని అందుకున్న నేపథ్యంలోనే.. హీరో తేజ సజ్జా కీలక నిర్నయం తీసుకున్నారని సమాచారం అందుతోంది. తన తర్వాతి సినిమాలకు రెమ్యూనరేషన్ పెంచారట. ఇకపై ప్రతీ సినిమాకు రూ.5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకోవాలని డిసైడ్ అయ్యాడట తేజ.