కృష్ణా జలాల వివాదంపై నేడు అసెంబ్లీలో వాడివేడి చర్చ

-

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఒకరోజు విరామం తర్వాత తిరిగి ఇవాళ ప్రారంభం కానున్నాయి. ఇవాళ్టి సమావేశాల్లో బడ్జెట్ పై చర్చ జరగనుంది. అంతే కాకుండా  కృష్ణా జలాల విషయంలో బీఆర్ఎస్ హయాంలోనే రాష్ట్రానికి తీరని నష్టం వాటిల్లినట్లు చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఓవైపు..  హక్కులను కాలరాసేలా హస్తం పార్టీ ప్రభుత్వమే ముందుకు వెళుతోందని  గులాబీ నేతలు ఆరోపణలు మరోవైపు.. ఈ క్రమంలో ఈ అంశంపై ఇవాళ పూర్తి స్థాయి చర్చ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశంపై వాడివేడి చర్చ జరగనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టేందుకు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంది.

ఇవాళ్టి చర్చలో కృష్ణా జలాల అంశంపై మాట్లాడటం కోసం ముందే ప్రిపేర్ అయిన కాంగ్రెస్..  అందులో భాగంగానే ఆదివారం సాయంత్రం ప్రజాభవన్‌లో కృష్ణా జలాల నిర్ణయాలపై ఎమ్మెల్యలు, ఎమ్మెల్సీలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా తదితర మంత్రులు, నేతలకు కృష్ణా జలాల వాడకంపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా సాగు నీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news