‘సరిపోదా శనివారం’ విడుదల అయ్యేది అప్పుడేనా?

-

నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘సరిపోదా శనివారం’ మూవీని ఆగస్టు లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.ఆగస్ట్ 15 లేదా 29న ఈ మూవీ థియేటర్లలోకి రానున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఒకవేళ ఆగస్టు 15న పుష్ప-2 సినిమా రిలీజ్ అయితే, నాని సినిమాను 29కి తీసుకురావాలని మూవీ టీమ్ ప్లాన్ చేస్తోందట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తుంది. ఎస్‍జే సూర్య ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.ఈ  చిత్రం  ఫస్ట్ గ్లింప్స్  ఆసక్తిని రేకెత్తిస్తుంది. యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది.నాని,వివేక్ కాంబినేషన్‍లో  వచ్చిన ‘అంటే సుందరానికి’ మూవీ కమర్షియల్‍గా ఆశించిన స్థాయిలో హిట్ కాకపోయినా.. మంచి చిత్రంగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే తాజాగా సరిపోదా శనివారం’ మూవీ ఓటీటీ రైట్స్ను రూ.45 కోట్లకు ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.ప్రస్తుతం ఈ చిత్రం పై  భారీ అంచనాలు నెలకొన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news