సాయి పల్లవికి చైతూ లవ్ ప్రపోజల్.. వీడియో వైరల్

-

టాలీవుడ్ స్టార్ హీరో, యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య మళ్లీ ప్రేమలో పడ్డారు. ఎవరితోనో కాదండోయ్ తన బుజ్జితల్లి సాయిపల్లవితో. ఇవాళ వాలంటైన్స్ డే సందర్భంగా చై సాయిపల్లవికి తన లవ్ ప్రపోజ్ చేశాడు. ఈ వీడియో కాస్త ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు సో క్యూట్, సో లవ్లీ, వావ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

చైతు- సాయిపల్లవి లీడ్ రోల్స్లో ‘తండేల్’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేయగా అందులో ఓ డైలాగ్ ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్లో ఉంది. ఈ డైలాగ్తో నెటిజన్లు రీల్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగ చైతన్య కూడా రీల్ చేసి తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు.

‘తండేల్ గ్లింప్స్కు వస్తున్న రెస్పాన్స్ పట్ల థ్రిల్లింగ్గా ఉంది. దానిపై మీరందరూ (నెటిజన్లు) రీల్స్ చేయడం సంతోషాన్నిస్తుంది. మీలాగే మేము (నేను & సాయి పల్లవి) కూడా రీల్ చేయాలనుకున్నాం. మీ అందరికీ తండేల్ మూవీ టీమ్ నుంచి హ్యాపీ వాలెంటైన్ డే’ అని చైతు పోస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news