సానుభూతి కోసం వీల్ చైర్ నాటకాలు: రేవంత్ రెడ్డి

-

కాలేశ్వరం ప్రాజెక్టు గోదావరి జలాల అంశం మీద చర్చించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. సీఎం రేవంత్ రెడ్డి అన్నారు మేడిగడ్డ మేడిపండులా కృంగిపోతే మీరు నింపడం సాధ్యమని అడిగాను. శాసనసభలో ఆయన మాట్లాడారు. నల్లగొండలో నిర్వహించిన బారాస సభలో పార్టీ అధినేత కెసిఆర్ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సీఎం పై అటువంటి భాష మాట్లాడతారా ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా వారి తీరు మారలేదు ఓట్లేసి గెలిపించిన సీఎం నీ ఉద్దేశించి ఆ భాష వాడతారా అని అన్నారు.

కేసీఆర్ హరీష్ రావుకే పెత్తనం ఇస్తాం మేడిగడ్డలో నీళ్లు నింపి అక్కడ నుండి అన్నారం సుందిళ్లలో ఎత్తిపోయించే బాధ్యత మీరే తీసుకోండి. సభకి రాకుండా సీఎం గురించి ఇలా మాట్లాడొచ్చా చర్చకు సిద్ధమైతే బారాస పక్ష నేతలు సభకి రమ్మని చెప్పండి రేపు సాయంత్రం వరకు మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాలేశ్వరం లో అవినీతి పాల్పడకపోతే చర్చకు రావాలి సభకు రాకుండా అక్కడెక్కడో ఎందుకని రేవంత్ రెడ్డి అన్నారు సానుభూతి కోసం వీల్ చైర్ నాటకాలని అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news