తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బహిరంగ సభ నిర్వహిస్తున్న విషయం మనకి తెలుసు అయితే ఈ రోజు పార్వతీపురంలో నిర్వహించిన శంఖారావం బహిరంగ సభలో నారా లోకేష్ మాట్లాడారు. జగన్ కి డయేరియా అనే జబ్బు ఉందని గుంటూరులో సురక్షితమైన త్రాగునీరు కూడా అధికార ప్రభుత్వం అందించట్లేదని ఆరోపించారు. కలుషితమైన నీరు త్రాగడం కారణంగా గుంటూరులో ఇద్దరు వ్యక్తులు ప్రాణాన్ని కోల్పోయారని అన్నారు.
వందలాది మంది ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యే పరిస్థితిని ఈరోజు చూస్తున్నామని అన్నారు ఇంత జరుగుతున్న దున్నపోతు ప్రభుత్వం నిద్రలేవట్లేదని వైసీపీ మీద మండిపడ్డారు ఇంతమంది చనిపోతున్న ప్రభుత్వం సమీక్ష చేయలేదని అన్నారు. తెలుగుదేశం పార్టీ మహానాడులో మీరు ఆనాడు చంద్రబాబు నాయుడు నాటిన తులసి మొక్కను అని అన్నారే మరి ఆ తులసి మొక్క జగన్ పెంచిన గంజాయి మొక్కగా ఎలా మారారో ప్రజలకి దయచేసి చెప్పమని కోరారు ఇలా సభ ముఖంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రశ్న అడగాలని చెప్పారు నారా లోకేష్. అలానే జగన్ కి మధ్యన సినిమా పిచ్చి ఎక్కువైందని అన్నారు.