రేపు గ్రామీణ భారత్‌ బంద్‌.. పిలుపునిచ్చిన సంయుక్త కిసాన్‌ మోర్చా

-

కనీస మద్దతు ధరకి చట్టబద్ధతతోపాటు పలు డిమాండ్ల సాధన కోసం దేశ రాజధాని ఢిల్లీని ముట్టడించిన రైతులు తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. ఈ నెల 16న గ్రామీణ భారత్‌బంద్‌కు పిలుపునిచ్చారు.
తమ సమస్యలను ప్రజలకు వివరించి, కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకే భారత్‌బంద్‌కు పిలుపునిచ్చినట్టు సంయుక్త కిసాన్‌ మోర్చా  ప్రకటించింది. ఈ బంద్‌కు పలు కేంద్ర కార్మిక సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. ఫిబ్రవరి 16న ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బంద్‌ కొనసాగుతుందని రైతు సంఘాల నేతలు ప్రకటించారు.  అదేవిధంగా ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జాతీయ రహదారులన్నింటినీ స్తంభింపజేస్తామని తెలిపారు. ఇందుకు రైతులందరూ సహకరించాలని కోరాయి కార్మిక సంఘాలు.

Read more RELATED
Recommended to you

Latest news