లియో’ పార్ట్‌ 2 పై కీలక వ్యాఖ్యలు చేసిన లోకేష్‌ కనగరాజ్‌

-

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ దళపతి హీరోగా నటించిన చిత్రం లియో. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. లియో సినిమా విజయ్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. అయితే ఈ చిత్రం యొక్క సెకండ్ పార్ట్ త్వరలోనే రానుందని వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన విషయంపై లోకేష్ కనగరాజ్ స్పందించారు.

ఇటీవల ఓ ఇంటర్య్వూలో ఈ మూవీకి సీక్వెల్‌ రానుందా అని అడిగిన ప్రశ్నకు లోకేష్‌ సమాధానం ఇచ్చారు. లియో సినిమా పార్ట్‌2 కచ్చితంగా ఉంటుంది. ప్రస్తుతం విజయ్‌ ఆశయం సినిమాలకు భిన్నంగా ఉంది. అందుకు అభినందిస్తున్నా. విజయ్‌ ఒప్పుకుంటే లియో 2 ఉంటుంది. దానికి సమయం అనుకూలించి,విజయ్ ఎప్పుడు నాకు ఫోన్‌ చేస్తే అప్పుడు మూవీ మొదలవుతుంది. అలాగే లియో సెకండాఫ్‌ మిస్టేక్స్ రిపీట్ చేయను. ఇకపై చేసే చిత్రాల్లో ఆ తప్పులు లేకుండా చూసుకుంటాను అని లోకేష్ అన్నారు.

లియోలో త్రిష హీరోయిన్గా నటించగా సంజయ్ దత్, గౌతమ్ మీనన్ తదితరులు కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి అనిరుద్ అందించిన పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా సీక్వెల్ ఉంటుందని తెలిసిన విజయ్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news