ఆ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి.. సోనియా కి కవిత లేఖ..!

-

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి కవిత లేఖ రాశారు ఈ విషయాన్ని స్వయంగా కవిత సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారెంటీలను నమ్మి ప్రజలు విద్యార్థులు అధికారం కట్టబెట్టారని చెప్పారు అధికారంలోకి రాదని ఎన్నో ఉద్యమాలు పోరాటాల ఫలితంగా వచ్చిన ఆడపిల్ల హక్కులని కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని అన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 4156 జీవోలని రద్దు చేస్తూ ఈనెల 10వ తేదీన జీవో తెచ్చింది రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని అమలు చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన తాము మహిళల హక్కులు హరించబోమని 2023 జనవరిలో కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. దీంతో మహిళల హక్కుల్ని శాశ్వతంగా హరిస్తూ పాయింట్లు లేకుండా హారిజంటల్ పద్ధతులు రిజర్వేషన్ కల్పించడానికి జీవో నెంబర్ 3 ని ప్రభుత్వం జారీ చేసింది ఈ అంశంపై జాతీయ పార్టీ అనే కాంగ్రెస్ వైఖరి ఏంటో చెప్పాలని, వెనక్కి తీసుకోవాలని సేమ్ రేవంత్ రెడ్డికి ఆదేశాలు జారీ చేయాలని సోనియా గాంధీకి లేఖలో కవిత రాశారు.

Read more RELATED
Recommended to you

Latest news