హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్…. ఈ ప్రాంతాల్లో తాగునీరు బంద్..

-

నగర వాసులకు బిగ్ అలర్ట్ .మహా నగరానికి ఒక రోజు తాగునీటిలో సరఫరాలో అంతరాయం ఉంటుందని జలమండలి తెలిపింది. సింగూరు ప్రాజెక్టులోని పెద్దాపూర్ పంప్ హౌజ్ దగ్గరున్న 132 కేవీ కంది-పెద్దాపూర్ ఫీడర్ లో tspdcl పలు కరెంట్ పనులు చేపట్టనున్న క్రమంలో ఫిబ్రవరి 22, 2024 తేదిన గురువారం ఉదయం 8 గంటల నుంది కొన్ని ప్రాంతాల్లో పాక్షికముగా,మరికొన్ని ప్రాంతాల్లో పూర్తిగా నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది.

అంతరాయం ఏర్పడు ప్రాంతాలు:

ఓ అండ్ ఎం డివిజన్ – 6 : బంజారా, ఎర్రగడ్డ రిజర్వాయర్ల ప్రాంతాల్లో (పాక్షిక), బోరబండ రిజర్వాయర్ ప్రాంతాల్లో (పూర్తిగా).

 

ఓ అండ్ ఎం డివిజన్ – 3 : షేక్ పేట్ రిజర్వాయర్ (పూర్తిగా), భోజగుట్ట (పాక్షిక).

ఓ అండ్ ఎం డివిజన్ – 9 & 15 : లింగంపల్లి రిజర్వాయర్ ప్రాంతాల్లో, ఆన్ లైన్ సప్లయ్ (పూర్తిగా).

ఓ అండ్ ఎం డివిజన్ – 18 : ఖానాపూర్ గ్రావిటీ 1200     ఎంఎం మెయిన్ ఆన్ లైన్ సప్లయ్ ప్రాంతాలు (పూర్తిగా)

కావున పైన పేర్కొన్న ప్రాంతాల వినియోగదారులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని ,పనులు పూర్తయిన వెంటనే నీటి సరఫరా యథాతథంగా కొనసాగుతుందని జలమండలి పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news