మరోసారి తండ్రి అయిన విరాట్ కోహ్లి

-

విరాట్ కోహ్లి-అనుష్క శర్మ దంపతులు మరోసారి తల్లిదండ్రులయ్యారు. అనుష్క శర్మ మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని విరాట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. రెండో బిడ్డకు ‘అకాయ్’గా నామకరణం చేసినట్లు వెల్లడించారు. ఈ సమయంలో తమ ప్రైవసీని గౌరవించాలని కోరారు. ఫ్యాన్స్ విరాట్ అనుష్క దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.కాగా జనవరి 11, 2021న కోహ్లి-అనుష్క దంపతులకు తొలి సంతానంలో వామిక జన్మించింది.ఇకపోతే విరుష్క దంపతులు 2013 లో ఒక షాంపూ యాడ్ ద్వారా కలుసుకున్న వారు ఇరు కుటుంబాలను ఒప్పించి.. ఈ జంట 2017 డిసెంబర్ 11న వివాహబంధంతో ఒక్కటయిన సంగతి తెలిసిందే.

Virat Kohli and Anushka Sharma

స్వదేశంలో ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో మొదటి 3 మ్యాచ్లకు టీమ్ ఇండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లి దూరం అయిన సంగతి తెలిసిందే. వీటితో పాటు మిగతా టెస్టులకు కూడా విరాట్ కోహ్లీ డౌటే అని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news