ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదురుకుంటున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ ని విచారించేందుకు ఈడీ నోటీసులు పంపుతున్న…. కేజ్రీవాల్ మాత్రం ఈడీ ఇచ్చిన నోటీసులను లెక్కచేయకుండా పక్కకి పెట్టి తన రాజకీయ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. తాజాగా ఏడోవ సారి కూడా లిక్కర్ స్కాం కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపింది.
ఈ నెల 26న ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కాగా గతంలో కేజీవాలకు ఈడీ ఆరుసార్లు నోటీసులు జారీ చేసింది. కానీ ఆయన ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదు. మరి ఆరు సార్లు ఈడీ నోటీసులు పంపిన పట్టించుకోని సీఎం కేజ్రీవాల్….. మరి ఈసారైనా విచారణకు హాజరు అవుతారా? లేదా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.ఈడీ నోటీసులు అక్రమం, చట్ట విరుద్ధమని ఆయన వాదిస్తున్నారు.