లోక్ సభ ఎన్నికల్లో పోటీపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొత్తులపై కాంగ్రెస్ పార్టీయే తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. లోక్ సభ ఎన్నికల్లో సీపీఎం రెండు స్థానాల్లో పోటీ చేస్తుందని తెలిపారు.పొత్తు ఉన్నా లేకున్నా రెండు ఎంపీ సీట్లలో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. కమ్యునిస్టులతో కలిసి పనిచేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.మరోవైపు.. కాంగ్రెస్ పట్ల బీఆర్ఎస్ శత్రుపూరిత వైఖరి అవలంభిస్తోందని అసహనం వ్యక్తం చేశారు.గత ప్రభుత్వ అవినీతి సొమ్మును కక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తామన్నారు.
ఇదిలా ఉంటే.. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం ఒంటరిగా పోటీ చేసి ఒక్క స్థానాన్ని కూడా కైవసం చేసుకోలేకపోయింది. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు మాత్రం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మరోవైపు కేంద్రంలో వామపక్షాలు కాంగ్రెస్‌కు మద్ధతు ఇస్తున్నాయి.