లైంగిక వేదింపుల కేసులో స్టార్ ఫుట్ బాలర్ కి జైలు శిక్ష..!

-

లైంగిక వేధింపుల కేసులో స్టార్ ఫుట్ బాలర్ కి జైలు శిక్షతో పాటు భారీ జరిమానా కూడా విధించింది స్పానిష్ కోర్టు. ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో బ్రెజిల్ మాజీ ఫుల్ బాలర్ డానీ అల్వెస్ కి (40) నాలుగున్నర  సంవత్సరాల పాటు జైలు శిక్షతో పాటు రూ.13కోట్లు జరిమానా విధించింది. స్పెయిన్ లోని బార్సిలోనా కోర్టు. 2022 డిసెంబర్ 31న అల్వెస్.. సదరు మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు అనుమతి లేకుండా లైంగిక చర్యకు పాల్పడ్డాడని రుజువు కావడంతో కోర్టు ఈ తీర్పునిచ్చింది.

ఈ కేసులో అల్విస్ ను ఈ ఏడాది జనవరి 20న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి అతను రిమాండ్ లోనే ఉన్నాడు. అల్విస్ బెయిల్ ప్రయత్నాలను కోర్టు తిరస్కరించింది. తాను నిరపరాధినన్న వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో అల్వెస్ భార్య స్టేట్ మెంట్ కూడా కోర్టు పట్టించుకోలేదు. అల్వెస్ ఫుట్ బాల్ కెరీర్ విషయానికి వస్తే.. 2006 నుంచి 2022 వరకు బ్రెజిల్ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 126 మ్యాచ్ లు ఆడి 8 గోల్స్ చేశాడు. రైట్ బ్యాక్ స్థానంలో ఆడతాడు.

Read more RELATED
Recommended to you

Latest news