‘కుర్చీ మడతపెట్టి’ పాటకి తమ స్టెప్పులతో ఇచ్చిపడేసిన జపాన్ జంట

-

తెలుగు పాటలు ఇంటర్నేషనల్ వైడ్ రీచ్ అందుకుంటున్నాయి. ఆర్ఆర్ఆర్, పుష్ప వంటి చిత్రాల సాంగ్స్ గ్లోబల్ వైడ్ రీచ్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ మూవీలోని ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ తెలుగు అభిమానులని ఉర్రూతలూగించిన విధంగానే అంతర్జాతీయ స్థాయిలో ఆడియన్స్ ని కూడా ఉత్సాహపరుస్తుంది.

ఇటీవల కొందరు ఫారినర్స్ ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ ని తమ జిమ్ వర్క్ అవుట్స్ కి ఉపయోగించుకుంటూ ఉండే వీడియో సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. ఆ వీడియో పై ప్రిన్స్ మహేష్ బాబు కూడా రియాక్ట్ అయినా సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఒక జపాన్ జంట…. మహేష్ బాబు, శ్రీలీల వేసిన స్టెప్స్ ని రీ క్రియేట్ చేస్తూ చేసిన రీల్ ఒకటి సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.టాలీవుడ్ మాస్ సాంగ్ కి జపాన్ జంట వేసిన స్టెప్పులు చూసిన టాలీవుడ్ ఆడియన్స్….. ‘జపాన్ జంట స్టెప్పులతో ఇచ్చిపడేశారు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా తన గ్రేస్ తో అమ్మాయి బాగా డాన్స్ వేసిందంటూ ప్రశంసలు కురిపించారు.

Read more RELATED
Recommended to you

Latest news